తిరుపతి వెంకన్నసాక్షిగా హామీలిచ్చి గాలికొదిలేసిన బాబు: భూమన కరుణాకర్ రెడ్డి

  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన భూమన  
  • తిరుపతిలో ప్రజా బ్యాలెట్ నిర్వహణ 
  • డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారని ఆరోపణ 
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు హామీలిచ్చి గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. నేడు తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో చంద్రబాబు పాలనపై కరుణాకర్ రెడ్డి, వైసీపీ నేతలు ఎస్‌కే బాబు, ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వెంకన్న సాక్షిగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గాలికొదిలేశారని విమర్శించారు. ఆయన మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు తీవ్రంగా మోసపోయారన్నారు. 

Bhumana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News